గోదావరిలో మునిగి ముగ్గురు యువకులు, ఒకరు గల్లంతు.... -ఇద్దరు ఆసుపత్రికి తరలింపు
By: Mohammad Imran
On
గోదావరిలో మునిగి ముగ్గురు యువకులు...
ఒకరు గల్లంతు....
-ఇద్దరు ఆసుపత్రికి తరలింపు
ధర్మపురి మండలం లోని రాయపట్నం గోదావరి వద్ద స్నానం కోసం వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాద వశాత్తు నీటిలో మునిగిపోయారు. కరీంనగర్ శ్రీనగర్ కాలానికి చెందిన రాగుల పవన్ కుమార్(బిట్టు) నవిత్,అశ్విన్, అనే యువకులు బైక్ పై గోదావరి స్నానాల కోసం వచ్చి ప్రమాద వశాత్తు మునిగిపోయారు.అక్కడ ఉన్న జాలర్లు,పరిసరాల వాసులు రక్షించగా వారిని ఆసుపత్రికి తరలించారు.అక్కడి కి చేరుకున్న ఎస్ఐ గంగుల మహేష్ రాగుల పవన్(బిట్టు) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆసుపత్రికి తరలించిన వారిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది
Tags:

