నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం

నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.

 మొదటి మందు పాతర...  జిల్లాలో కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని కాల్చి చంపిన సంఘటన ప్రథమం....

నేటి నుండి 31 అక్టోబర్ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాలు

పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా చురకలు ప్రత్యేక కథనం.

చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 20 : విధి నిర్వహణలో ప్రాణాలను ఆర్పించిన పోలీసులను స్మరించుకునేలా, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడానికి పోలీస్ శాఖ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా చురకలులో ప్రత్యేక కథనం... నక్సలేట్ల,
పోలీసుల మధ్య జరిగిన సంఘటనల్లో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 1989 సెప్టెంబర్లో పోలీసులను హతమార్చడానికి బీర్పూర్ వద్ద పెట్టిన మందుపాతరలో 14 మంది
అయామకులు చనిపోగా, రాష్ట్రంలోనే మొట్టమొదటి పోలీసులు కోసం నక్సల్స్ పేల్చిన మందుపాతర సంఘటన ఇది.

జిల్లాలో కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని కాల్చిన చంపిన సంఘటన ప్రథమం....
పోలీసుల అమరవీరు సంస్మరణ దినోత్సవం ప్రతి ఏడాది అక్టోబర్ 21న జరుపుకుంటారు. భారత్-చైనా సరిహద్దుల్లోని ఆక్సయ్ చిన్ ప్రాంతంలో 16 వేల అడుగుల ఎత్తున రక్తం గడ్డకట్టే మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటిబుగ్గ (హాట్ స్ప్రింగ్స్) అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచి ఉంది. దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈపవిత్ర స్థలం నుంచే ఆరంభమైంది. మిలటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడక్, సియాచిన్ ప్రాంతాలు కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడక ముందు సరిహద్దులను రక్షించే మహత్తర బాధ్యతను కేంద్ర రిజర్వు పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వ ర్తించేవి. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల బృందం సరిహద్దుల్లో
విధులు నిర్వ ర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియాచన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సిఆర్పిఎఫ్ దళం హాట్ స్ప్రింగ్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఆ పోరాటంలో పది మంది భారత జవాన్లు ప్రాణాలను కోల్పోయారు. హాట్ స్ప్రింగ్ అంటే వేడి నీటిబుగ్గ అని అర్థం. కానీ భారత జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ నెత్తుటి బుగ్గగా మారి పవిత్ర స్థలంగా రూపు దిద్దుకొంది. ప్రతి ఏడాది ఈ పవిత్ర స్థలాన్ని సందర్శించి నివాళులర్పించడం ఆనవాయితీ... భారత్-చైనా సరిహద్దులో ఉన్న లడక్లోని
ఆక్సాయ్చిన్ వద్ద కేంద్ర రిజర్వు పోలీసు దళం ( సిఆర్పిఎఫ్) సరిహద్దు రక్షణలో ఉన్నారు. 1959 అక్టోబర్ 21న విపరీతమైన చలిలో పది మంది సిఆర్పిఎఫ్ పోలీసులు విధులు నిర్వహిస్తుండగా చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చోచ్చుకొని వచ్చారు. వారిని ఈ పది మంది పోలీసులు ధైర్యంతో ఎదిరించి, చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి, దేశం కోసం అసువులు బాశారు. భారతదేశ రక్షణ కోసం పోలీసు ఉన్నతాధికారులు 1960 జనవరి 9న సమావేశమై అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ
దినంగా పాటించాలని తీర్మాణించారు. ఆనాటి నుండి నేటి వరకు దేశవ్యాప్తంగా అక్టోబర్ 21వ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నారు. ప్రస్తుత మావోయిస్టు పార్టీ
అప్పటి ఫీపుల్స్వర్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గ శత్రువుగా పాటించి మొదట రాష్ట్రంలోని రాజధాని హైద్రాబాద్లో, జిల్లాలో మొదటగా అప్పటి కరీంనగర్ జిల్లా ధర్మపురిలో ఇద్దరు పోలీసులను హతమార్చడం జరిగింది. రాష్ట్రంలో నక్సల్స్ పోలీసులపై దాడులను అప్పటినుంచే ప్రారంభించారు. అప్పటి పీపుల్స్ వార్ వ్యవస్థాపక
నాయకుడైన కొండపల్లి సీతారామయ్య అరెస్టు అయి హైద్రాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను తప్పించడానికి డ్యూటీలో ఉన్న ముగ్గురు పోలీసుల్లో ఇద్దరిని అక్కడే కట్టేసి మహమ్మద్ ఇబ్రహీం అనే కానిస్టేబుల్ ను కాల్చి చంపిన ఉమ్మడి రాష్ట్ర రాజధానిలో ప్రథమంగా జరిగింది. 1985 జూలై 23న ధర్మపురిలో నక్సలైట్లు తుమ్మ లక్ష్మినర్సయ్య, ఖాధీర్లు కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని కాల్చి చంపి, అతని చేతిలోని రివాల్వర్ తీసుకొని వెళ్ళిపోయారు. రాష్ట్రంలోనే రెండవదిగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో
నే ప్రథమంగా ధర్మపురిలో కానిస్టేబుల్ కోమల్ రెడ్డిని కాల్చి చంపిన సంఘటన ప్రథమం. కోమల్రెడ్డి ఘటన తర్వాత పోలీసులను టార్గెట్గా చేస్తూ రాష్ట్రంలో అనేక సంఘటనలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే జిల్లాలోని ధర్మపురి మండలం నేరెళ్ల, సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి గ్రామాల మధ్య నక్సల్స్ మందుపాతర పేల్చగా ఈ బ్లాస్టింగ్లో నలుగురు
కానిస్టేబుళ్ల హతమయ్యారు. అదేవిధంగా మెట్పల్లి మండలం ఆత్మకూరులో కానిస్టేబుల్ రవీందర్ నాయకు, మేడిపల్లి మండలంలోని ఓడ్యాడ్డులో కానిస్టేబుల్ రాజన్న, కథలాపూర్ మండలంలోని భూషణావుపేటలో హెడాకానిస్టేబుల్ ఫసల్ద్దీన్, కానిస్టేబుల్ మోహీవోద్దీన్లు నక్సల్స్ కాల్పుల్లో మృతిచెందారు. జగిత్యాల మండలం కల్లెడలో హెడ్ కానిస్టేబుల్ మోబీన్ మృతి చెందారు. 1993 జూన్ 14న మల్హర్ మండలం ఎండపల్లి వద్ద మందుపాతర పేలిన ఘటనలో ఎస్ఎస్ఐ సుభాన్ మృతి చెందారు. 1993 జూలై 8న వరంగల్ కరీంనగర్
జిల్లా సరిహద్దులో నక్సల్స్ పేల్చిన మందుపాతరలో ఏఆర్ ఎస్ఐ వెంకటచారీ, హెడ్ కానిస్టేబుల్ నాగభూషణం. కానిస్టేబుళ్లు కిషన్ రావు, రవీందర్, దేవయ్యలు మృతి చెందారు. 1989 సెప్టెంబర్లో పోలీసులను హతమార్చడానికి సక్సల్స్ పెట్టిన మందుపాతరలో బీర్పూర్ వద్ద 14 మంది అమాయకులు మృతి చెందారు. హస్నాబాద్ మండలం రామావరం వద్ద నక్సల్స్ మందుపాతరతో సీఐ యాదగిరి, ఎస్ఐ జాన్విల్సిన్, ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి చెందారు. 1992లో ముత్తారం మండలం గాజులపల్లి వద్ద మందుపాతరతో ఇండో
టిబెటిన్ బోర్డు సెక్యూరిటీ పోలీసులు 9 మంది మృతిచెందగా, 1994లో నక్సల్స్ జరిపిన కాల్పుల్లో
గంభీరావుపేట ఎస్ఐ సయ్యద్ సాబీర్ ఖాన్ మృతి చెందారు. పెద్దపల్లి డిఎస్పీ బుచ్చిరెడ్డిని హతమార్చారు. అప్పట్లో జిల్లాలో పనిచేసిన పలువురు ఐపిఎస్ఆధికారులతో పాటు పలువురు డిఎస్పీలు, సీఐలు, ఎస్ ఐలు, కానిస్టేబుళ్లు కూడా టార్గెట్ లిస్టులో ఉన్నవారే.IMG-20241020-WA0014

Tags:

Related Posts