మోయుజ్ జాహాన్కు సన్మానం
మోయిస్ జహాన్ కు సన్మానం చేసిన డిప్యూటీ డైరెక్టర్
చురకలు విలేఖరి
హుజూరాబాద్, అక్టోబర్,01.
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ డివిజన్ సబ్ ట్రెజరీ కార్యాలయంలో పనిచేస్తున్న ఏటీవో మౌయుజ్ జాఃాన్ సోమవారం రోజు రాత్రి సిటీ ఫంక్షన్ హాల్ హుజూరాబాదులో పదవి విరమణ కార్యక్రమానికి కరీంనగర్ జిల్లా డిప్యూ టీ డైరెక్టర్ యు నాగరాజు ముఖ్యఅతిథిగా ఈ కార్యక్రమానికి పాల్గొనగా కార్యక్రమానికి సభాధ్యక్షు లు తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఖజానా డిప్యూ టీ డైరెక్టర్ యు నాగరాజు మాట్లాడుతూ హుజురాబాద్ కరీంనగర్ హనుమకొండ వరంగల్ జిల్లాలో జూనియర్ అకౌంటెంట్ స్థాయి నుండి అకౌంటెంట్ ట్రెజరీ అధికారిగా ఎదిగిన హుజురాబాద్ ఏ టి ఓ మోయిజ్ జహయన్ ఈరోజు నీతి నిజాయితీతో పనిచేసి ఖజానా డిపార్ట్మెంట్లో చాలా మంచి పేరును సంపాదించుకోవడం చాలా అదృష్టం ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించటంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నందుకు మొఐజ్ జాహయన్ ప్రత్యేక అభినందన లు తెలియజేస్తూ శాలువాతో పుష్పగుచ్చాలకు స్వీట్లు తినిపించి జిపిఎఫ్ కు సంబంధించిన ప్రోసిడింగ్ కాపీ అందరి సమక్షంలో అందజేయడం జరిగింది హుజురాబాద్ ఏటీవో మొయిజ్ జాహాన్ తన సర్వీస్ 37 సంవత్సరాలు పనిచేస్తూ ఈరోజు పదవి విరమణ కార్యక్రమానికి ఇంతమంది ఉద్యోగులు పెన్షనర్లు హాజరు కావడం చాలా సంతోషమని దాదాపు 5 గంటలు ఓపికతో సిటీ ఫంక్షన్ హాల్ లో అందరూ ఇంత క్రమశిక్షణతో ఉండటం నేను మొట్టమొదటిసారి పదవి విరమణ కార్యక్రమం చూడటం జరిగిందని అందుకు ఈ కార్యక్రమానికి హాజరైన అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పెన్షనర్లకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలంగాణ వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ హుజురాబాద్ సబ్ ట్రెజరీ పరిధిలో పెన్షనర్లు 1700 మంది అన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి సంబంధించిన జీతాలు ఇదే సబ్ ట్రెజరీ ద్వారా మంజూరు చేసి స్టేట్ బ్యాంకు పెంచటం ప్రతినెల పంపించడంలో ఇదే సబ్ ట్రెజరీలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ ఒక కుటుంబం లాగా ఉంటూ ప్రతి ఒక్కరూ ఉదయము నుండి సాయంత్రం వరకు పనిచేసి ప్రభుత్వ ఉద్యోగుల ఉపాధ్యాయుల పెన్షనర్ల వద్ద చాలా మంచి పేరు సంపాదించుకోవటం జీవితంలో చాలా మంచి రోజు ఇది ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి ఆ శాఖలో పని చేస్తూ 37 సంవత్సరాల తర్వాత పదవి విరమణ పొందిన రోజు ఇంత మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రతి ఒక్కరు వచ్చి ఏ టి ఓమౌయుజ్ జహన్ కు శాలువలు పుష్పగుచ్చాలతో సన్మానించడం చాలా సంతోషమని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా అన్నారు హుజురాబాద్ రెవెన్యూ డివిజన్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల సంఘం అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ భాష మాట్లాడుతూ హుజురాబాద్ సబ్ ట్రెజరీ లో ఏ టి ఓ మోయుజ్ జాహన్ ఇన్ని సంవత్సరాలు చాలా మంచిగా పని చేస్తూ పెన్షనర్ల వద్ద కూడా చాలా మంచి పేరు సంపాదించుకున్న అసిస్టెంట్ ట్రెజరీ అధికారి మొయుజ్ జహాన్ అందరూ పెన్షనర్ల అందరి తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేశారు రిటైర్డ్ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు మొహమ్మద్ ఉస్మాన్ భాష వారి సంఘం కార్యవర్గం ఆధ్వర్యంలో శాలువాలు పుష్పగుచ్చాలతో మెమోటో ఇచ్చి భారీ ఎత్తున సన్మానం చేయటం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాదాపు 500 మంది ప్రభుత్వం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ప్రతి ఒక్కరికి భోజనం చేయించటం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుండి పాల్గొన్న అధికారులు సోఫియా నీరజ పద్మ హనుమకొండ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్ వరంగల్ డిప్యూ టీ డైరెక్టర్ విజయ సారధి హుజురాబాద్ సబ్ ట్రెజరీ అధికారి శివరామకృష్ణ మల్లేష్ భూపాల్ పల్లి డిప్యూటీ డైరెక్టర్ ఇంచార్జ్ బెనర్జీ కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఖజానా ట్రెజరీ డిపార్ట్మెంట్ గజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు నాగరాజు జనరల్ సెక్రెటరీ గులాం రసూల్ కళాకారులు వేణుగోపాల్ రామనారాయణ రిటైర్డ్ టీచర్ ముంతాజ్ హుజురాబాద్ సబ్ రిజిస్టార్ జావీద్ ఎమ్మార్వో ఎంపీడీవోలు అన్ని ప్రభుత్వ శాఖ అధికారులు ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

