ఆస్పత్రుల పరిశీలనకు వెళ్తే అరెస్టుల దావా వసంత సురేష్
ఆసుపత్రుల పరిశీలనకు వెళ్తే అరెస్టులా?
ప్రభుత్వ వైఖరి జూగుప్సాకరం
జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్.
జగిత్యాల,సెప్టెంబర్ 23: తెలంగాణలో గాంధీ ఆస్పత్రి సహా దవాఖానాల పరిస్థితిపై అధ్యయనం చేసేందుకు సిద్ధమైన బీఆర్‌ఎస్ నిజ నిర్ధారణ కమిటి సభ్యులను కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగించి హౌస్ అరెస్ట్ చేయడం దురదృష్టకరమని జిల్లా పరిషత్ తొలి ఛైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు.
దావ వసంతసురేష్
మాట్లాడుతూ:-
రాష్ట్రంలో వైద్య ఆరోగ్య వ్యవస్థ దిగజారిందని, దీనిపై నిజానిర్ధారణకు బీఆర్‌ఎస్ పార్టీ అధిష్టానం దవాఖానాల పరిస్థితిపై అధ్యయనానికి మాజీ డిప్యూటీ సిఎం డాక్టర్ రాజయ్య,ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌తో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.ఈ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలపాలని సూచించడంతో, గాంధీ ఆస్పత్రిని సందర్శించేందుకు సిద్ధమైన రాజయ్య సహా, కమిటీ సభ్యులను, పోలీసులు హౌస్ అరెస్టు చేయడం,వారి ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మొహరించడం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఆసుపత్రుల పనితీరుకు, నిర్వహణకు నిదర్శనం అన్నారు.
నిజానిర్ధానకు వెళ్లిన కమిటీ సభ్యులను అరెస్ట్ చేయడం అంటే వాస్తవాలు దాచడమే అని, కమిటీ పర్యటిస్తే ప్రభుత్వంకు ఎందుకు అంత భయం అని ప్రశ్నించారు.
ఎలాంటి దాపరికం లేకపోతే ప్రభుత్వం త్రిసభ్య కమిటీ దర్యాప్తునకు సహకరించాలని డిమాండ్ చేశారు.
కమిటీ పర్యటిస్తే నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వంకే నివేదిస్తుందని తద్వారా సమస్యలు తెలుసుకొని ప్రజలకు మెరుగైన సేవలు అందించే అవకాశం ప్రభుత్వంకు ఉంటుందనే సోయి లేకపోవడం విచారకరం అన్నారు.
తెలంగాణ ప్రజల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుకోవడం సరికాదన్నారు. స్వార్థ రాజకీయాలా కోసం కాకుండా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేందుకు నిపుణులైన డాక్టర్ల బృందం,గాంధీ దవాఖానకు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో అర్ధం కావడం లేదన్నారు .
గాంధీ హాస్పిటల్‌లో తమ పార్టీ ప్రస్తావించిన మాతా శిశు మరణాల విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచిపెడుతుందా..లేదా తమ పరిపాలన వైఫల్యం బయటకు వస్తుందని భయపడుతున్నదా అని వసంత గారు ప్రభుత్వంను ప్రశ్నించారు.
ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి పిరికిపంద చర్యలను ఆపాలని,లేని పక్షంలో ప్రజల ప్రాణాలను కాపాడుకునేందుకు బీఆరెస్ పార్టీ ఉద్యమాలకు సిద్ధం అవుతుందని హెచ్చరించారు.

