బుగ్గారం యం. ఇ. ఓ గా వెంకటేశ్వర్లు
By: Mohammad Imran
On
బుగ్గారం మండల విద్యాధికారిగా వెంకటేశ్వర్లు
బుగ్గారం, సెప్టెంబరు 29:
జగిత్యాల జిల్లా బుగ్గారం నూతన మండల విద్యాధికారిగా సిరికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురోజు వెంకటేశ్వర్లు శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. మండల నోడల్ అధికారులను ఎంఈవోలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో మండల నోడల్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆయన ఎంఈఓ గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మార్సీ సిబ్బంది, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు శాలువాలు కప్పి సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రాధనోపాధ్యాయులు అన్నాడి మోహన్ రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మధుకర్ రావు, రాజశేఖర్, చంద్రశేఖర్ రెడ్డి, సి ఆర్ పి పురుషోత్తం ఎం ఐ ఎస్ రాజేష్, సిసిఓ హరిత, పాల్గొన్నారు
Tags:

