విజయ వేడుకే విజయ దశమి
*విజయ వేడుకే.. విజయదశమి*
*నవదుర్గా సేవా సమితి సభ్యులు..*
*ఘనంగా విజయదశమి వేడుకలు..*
జగిత్యాల:-
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయ దశమి అని నవదుర్గా సేవా సమితి ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జంబి గద్దె వద్దకు తీసుకువచ్చారు. జంబి గద్దె లోపల శమీ వృక్షాన్ని నెలకొల్పారు.
విజయదశమి పర్వదినం సందర్భంగా జగిత్యాలలో మహిషాసురుని దహనం వైభవంగా జరిగింది. విజయదశమిని పురస్కరించుకుని యేటా జంబిగద్దె ప్రాంతంలో మహిషాసురుని ప్రతిమను దహనం చేస్తుంటారు. ఇందులో భాగంగా నవదుర్గా సేవా సమితి ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో మహిషాసురుని ప్రతిమను టపాసులు పెట్టి పేల్చారు.
అనంతరం జమ్మి ఆకుతో అలయ్ బలయ్ పంచుకొని ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
దసరా పర్వదినం సందర్భంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు సేవా సమితి ట్రస్ట్ సభ్యులు తెలిపారు.
ఈకార్యక్రమంలో జగిత్యాల పట్టణ పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలతో కిక్కిరిసిపోయింది.

