మెట్పల్లి లో ఘనంగా వినాయక నిమజ్జనం

మెట్పల్లి లో ఘనంగా వినాయక నిమజ్జనం

మెట్పల్లిలో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం
- వినాయక నిమజ్జనోత్సవంలో మంచినీరు పంపిణీ చేసిన ముస్లీం యూత్  


మెట్ పల్లి, సెప్టెంబర్ 16 ) : మెట్ పల్లిలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు అందుకున్న గణనాథుడు శనివారం గంగమ్మ ఒడిలోకి వెళ్ళిపోయాడు. అయితే మెట్ పల్లి పట్టణంలో సోమవారం జరిగిన వినాయక నిమజ్జనోత్సవంలో పట్టణానికి చెందిన కొంతమంది ముస్లిం మైనారిటీ యూత్ సభ్యులు మత సామరస్యాన్ని చాటుకున్నారు. వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా గణనాథుల విగ్రహాలను ఊరేగించగా శోభయాత్రలో పాల్గొన్న భక్తులకు కొంతమంది ముస్లిం మైనారిటీ యూత్ సభ్యులు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసుకొని మంచి నీటిని పంపిణీ చేసి ఆకట్టుకున్నారు. మెట్ పల్లి పట్టణానికి చెందిన ముస్లీంపుర యూత్, మార్వెల్ యూత్ సభ్యులు భక్తులకు ఉచితంగా మంచి నీటిని పంపిణీ చేశారు. గత ఇరవై రెండు సంవత్సరాలుగా కొంతమంది ముస్లిం సోదరులు గణేష్ నిమజ్జనం సందర్భంగా హిందూ సోదరులకు చల్లటి మంచినీళ్లను ఉచితంగా సోదర భావంతో పంపిణీ చేసి గంగా జమున తహసీబ్ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే పదాలతో మరోసారి కులాలు, మతాలు వేరైనా తామంతా భారతీయులమని నిరూపించారు. పట్టణంలో మత సామరస్యాన్ని మరింత ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు చేపట్టిన యూత్ సభ్యులను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ , మున్సిపల్ చైర్ పర్సన్ రణవేని సుజాత సత్యనారాయణ, టి మోహన్, ఎస్సై చిరంజీవి తో పాటు పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. ఈ సందర్భంగా పలువురు యూత్ సభ్యులు మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే నినాదానికి నిదర్శనం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మన దేశంలో అన్ని వర్గాల ప్రజలు హాయిగా జీవనం సాగిస్తున్నారని, కులాలు, మతాలకు అతీతంగా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే మతసామరస్యాన్ని మరింతగా పెంపొందించేందుకు మా యూత్ ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. పట్టణంలో హిందూ ముస్లిం భాయి భాయి అన్న నినాదం మరింత వర్ధిల్లే విధంగా పని చేస్తామని, ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ మనుషులంతా ఒక్కటే అన్న నిజాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలన్నారు. కులాలు మతాలకు అతీతంగా సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావించాలని, ఈ సేవ కార్యక్రమాలను యధావిధిగా కొనసాగించేందుకు మరింత పని చేస్తామని తెలిపారు. యూత్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నాయి. వాటిని అలాగే కొనసాగించి స్ఫూర్తిని నింపాలి. ఈ కార్యక్రమంలో ముస్లీంపుర యూత్, మార్వెల్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.IMG-20240916-WA0019

Tags:

Related Posts