అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు యస్.జి.ఎఫ్

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు యస్.జి.ఎఫ్

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థులకు యస్.జి.ఎఫ్


రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో ప్రశంసా పత్రాలు

చురకలు విలేఖరి 
కరీంనగర్, అక్టోబర్,20

ప్రపంచ క్రీడల్లో క్రికెట్కు ప్రత్యేక స్థానం ఉన్నదని మరియు చాలా మంది క్రికెట్ ఆడటానికి ఆసక్తి చూపుతారని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా॥ వి. నరేందర్ రెడ్డి  స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులు యన్.జి.ఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ చాటి ప్రశంస పత్రాలు సాధించిన సందర్భంగా ఏర్పాటుచేసినటువంటి ప్రత్యేక అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యస్.జి.ఎఫ్ వారు పలు టోర్నమెంట్ల నిర్వహణ చూడడమే కాకుండా వారిని సరైన పద్దతిలో అమలుపర్చేలా పలు నియమనిభందనలు తెలుపుతోందని చెప్పారు. మన మన రాష్ట్రంలో యస్.జి.ఎఫ్ వారు ఆదేశించిన ప్రకారం నిర్దేశించిన సమయంలో ఆడాలని మరియు ఆటగాళ్ల ప్రదర్శన మెరుగుపర్చుకోవాలని సూచించారు. పాఠశాల స్థాయిలో నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులచే శిక్షణ ఇప్పిస్తూ వారిని వివిధ స్థాయిలో నిర్వహించబడే పలు క్రీడా పోటీలకు ఎంపిక చేయడమే కాకుండా కావల్సిన సమయంతో పాటు ప్రోత్సాహం అందించడం జరుగుతుందని చెప్పారు.

ఇటీవల కాలంలో జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో యన్.జి.ఎఫ్ వారు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాఠశాలకు చెందిన యన్.సుమేద్, 9వ తరగతి మరియు యన్.ప్రధ్యుమ్న, 8వ తరగతి రాష్ట్ర స్థాయి పోటీలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు ప్రశంసా పత్రాలను సాధించారని హర్షం వ్యక్తం చేస్తు వారిరువురికి పుష్పగుచ్చాలందజేసి రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20241020-WA0009

Tags:

Related Posts