వసతి గృహ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం
వసతి గృహ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంపులో గల ఎస్సి బాలుర వసతి గృహ విద్యార్థుల తల్లిదండ్రులతో వసతి గృహ కార్యాలయంలో ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వసతి గృహ సంక్షేమ అధికారి శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రలోని ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలు, గురుకుల విద్యార్థులకు కాస్మోటిక్ చార్జెస్, డైట్ చార్జెస్ పెంచడం జరిగిందన్నారు. ఈ చార్జీలు ఈ నెల 1 నుండి అమలులోకి వచ్చాయని తెలిపారు. పెరిగిన చార్జెస్ కి అనుగుణంగా నూతన మెనూ ఏర్పాటు గురించి తల్లితండ్రుల నుండి సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు రమేష్, లక్ష్మీ నర్సయ్య, సభ్యులు భాగ్య, లాస్య, స్వప్న, ఇతర విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు తల్లిదండ్రులు, సిబ్బంది కలిసి సహాపంక్తి భోజనం చేసారు.