కోరుట్ల ఎంఐఎం పట్టణ కమిటీ అధ్యక్షుడిగా అబ్దుల్ రఫీ ఎన్నిక
ఎంఐఎం పట్టణం కమిటీ అధ్యక్షుడిగా అబ్దుల్ రఫీ ఎన్నిక
ఎన్నికల పరిశీలకులుగా హాజరైన సమద్ బిన్ అబ్దాత్..గులాం అహ్మద్ హుస్సేన్
ప్రజాసేవ చేసేవారికి ఎంఐఎం లో తగిన గుర్తింపు ఉంటుంది
ఎంఐఎం రాష్ట్ర సభ్యత్వ నమోదు ఇంచార్జ్ సమద్ బిన్ అబ్దాత్
కోరుట్ల, అక్టోబర్ 27:-
ఎంఐఎం పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్ రఫీ ఆదివారం ఎన్నికయ్యారు. మైనారిటీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పట్టణ కమిటీ ఎన్నిక కార్యక్రమంలో మొదటగా కోరుట్ల పట్టణానికి సంబంధించి 10 వార్డుల్లో వార్డు కమిటీ అధ్యక్షులను, కమిటీ సభ్యులను ఎన్నికల జరిగింది. అనంతరం వార్డు అధ్యక్షుల ఏకాభిప్రాయంతో పట్టణ అధ్యక్షుడిగా మహమ్మద్ అబ్దుల్ రఫీ ఎన్నికైనట్లు ఎన్నికల పరిశీలకులు ఎంఐఎం పార్టీ రాష్ట్ర సభ్యత నమోదు ఇంచార్జ్ సమద్ బిన్ అబ్దాత్, ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా ఎంఐఎం ఇన్చార్జ్ సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ లు ప్రకటించారు.ఈసందర్భంగా ఎన్నికల పరిశీలకులు సమద్ బిన్ అబ్దాత్ మాట్లాడుతూ గత రెండు నెలల క్రితం కోరుట్ల ఎంఐఎం పట్టణ కమిటీ ని రద్దు చేయడం జరిగిందని రద్దు చేశాక, ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం తో పాటు, ఎంఐఎం పార్టీ తాత్కాలిక అడ్ హాక్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కోరుట్ల పట్టణానికి సంబంధించి 10 వార్డుల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేసి అట్టి సభ్యత నమోదుకు సంబంధించిన ప్రతి అంశాన్ని తమ అధినేత అసదుద్దీన్ ఓవైసీ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అన్నారు. అనంతరం తమ అధినేత ఆదేశాల మేరకు ఆదివారం వార్డు కమిటీ అధ్యక్షులు ఎన్నికతో పాటు పట్టణ కమిటీ అధ్యక్షుడి ఎన్నికను యావత్తు కార్యకర్తల సమక్షంలో ఎన్నుకోవడం జరిగిందని వెల్లడించారు. ఎన్నికైనటువంటి నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కోరుట్ల మున్సిపల్ కౌన్సిల్లో అత్యధికంగా కౌన్సిలర్ సీట్లు గెలవాలని ఆకాంక్షించారు. పార్టీ బలోపేతం కోసం నూతన కమిటీ అందర్నీ కలుపుకొని పనిచేయాలని, పార్టీని సంస్థగతంగా ప్రజల్లో నిర్మాణం చేయాలని నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి అలుపెరుగకుండా కృషి చేయాలని సూచించారు. ఎంఐఎం పార్టీ యొక్క గుర్తింపు ప్రజాసేవతోనే వస్తుందన్నారు. ప్రజా సేవ కోసం పరితపించే నాయకులకు ఎంఐఎం పార్టీ తప్పకుండా తగిన గుర్తింపు ఇస్తుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో...ఎంఐఎం నాయకులు అబ్దుల్ వాజిద్,
రౌఫ్ రెహమాన్, అబ్దుల్ కలీం,
మహమ్మద్ ముజాహిద్,
మహమ్మద్ అబ్దుల్లా,
మొహమ్మద్ ఇమ్రోజ్,
మహ్మద్ ముస్తాక్,
కె సురేష్,
అబ్దుల్ రహీం తదితరులు పాల్గొన్నారు.