ఎమ్మెల్యే,, ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఖండిస్తున్నా దావా వసంత సురేష్

ఎమ్మెల్యే,, ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఖండిస్తున్నా దావా వసంత సురేష్

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం.

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రోజు ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిపోయారు.

మాజీ జడ్పీ  చైర్ పర్సన్ దావ వసంత సురేష్

చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 24: బిఆర్ఎస్ పార్టీపై ఎమ్మెల్యే డా. సంజయ్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని,  సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న రోజు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారిపోయారని మాజీ జడ్పీ  చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. గురువారం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. 
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇటీవలే ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉందని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్  బిఆర్ఎస్ పార్టీని విడిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అర్ధరాత్రి కాంగ్రెస్ కండువా కప్పుకున్న రోజే కాంగ్రెస్ వ్యక్తి అయ్యారని,  బిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోయి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మళ్లీ తాను బిఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నాను అనడం చాలా విడ్డూరంగా ఉందని, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోక పోతే గాంధీభవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పెట్టిన సమావేశానికి ఎందుకు హాజరయ్యారని,  ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బిఆర్ఎస్ పార్టీపై గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారని,  జగిత్యాల లోని చిన్న పిల్లవాడు నుంచి పెద్ద వారి దాకా అందరికీ తెలిసిందేనన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్  ఒక వైద్యుడు,వైద్యుని దగ్గరికి ఒక పేషెంట్ వస్తే ఎలా ప్రవర్తిస్తాడో తెలిసిన వ్యక్తి మరి ఇలా ఎందుకు మాట్లాడారో అతని మానసిక ఆరోగ్య పరిస్థితి బాగాలేదన్నారు . గతంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కు రాజకీయ జన్మనిచ్చింది బిఆర్ఎస్ పార్టీ మరియు ఎమ్మెల్సీ కవిత అని చెప్పి నిన్న మాత్రం కాంగ్రెస్ పార్టీ నేపథ్యం కలిగిన కుటుంబం అని సోయి లేకుండా మాట్లాడుతున్నారు.
మా కుటుంబ నేపథ్యం కాంగ్రెస్ పార్టీ అంటున్న ఎమ్మెల్యే గతంలో ఎన్నికల ప్రచార సమయంలో రాహుల్ గాంధీ  జగిత్యాలలో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్  రాహుల్ గాంధీని పప్పు అని స్క్రిప్ట్ చదివారని మరి ఎందుకు విమర్శలు చేశారన్నారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎమ్మెల్యే పదవి పోతుందని భయంతో ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతున్నారన్నారు.
ఎమ్మెల్యే డా. సంజయ్ కు రాజకీయంగా జన్మనిచ్చింది, ఎమ్మెల్యే పదవి తీసుకొచ్చింది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత అని, ఇంత నీచమైన దిగజారుడు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
జగిత్యాల రూరల్ మండల జాబితాపూర్ గ్రామంలో జరిగిన మారు గంగారెడ్డి హత్యని బిఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూనమన్నారు. బిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడ్డాడని అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి  మాటలను బిఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. 
హత్యకు బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదన్నారు. పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో జగిత్యాల నియోజకవర్గంలో ప్రశాంతమైన,పచ్చనైన సంక్షేమం అభివృద్ధి ప్రజల యొక్క శాంతి భద్రతలే ధ్యేయంగా ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, ఈనాడు శాంతి భద్రతలకు నిరంతం వాటిల్లిందని స్వయంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి ఇలా మాట్లాడితే సామాన్యుల పరిస్థితి ఏంటని బిఆర్ఎస్ పక్షాన అడుగుతున్నామన్నారు. 
రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం ఎందుకు వాటిల్లుతుందని ప్రజలతో పాటు మేము కూడా భయాందోళనకు గురై పరిస్థితి ఉందన్నారు.  ఉద్యమనాయకుడు కెసిఆర్ నాయకత్వంలో ఒక్క రక్తపు బొట్టు కూడా నెలకు రాలకుండా రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కెసిఆర్ అని, 
ఇప్పుడు జరుగుతున్న నెర చరిత్రకు,రక్తపు మరకలకు,హత్యలకు బిఆర్ఎస్ పార్టీకి కానీ కెసిఆర్  నాయకత్వంలో పనిచేస్తున్న ఏ ఒక్కరికీ కూడా సంబంధం లేదన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న కెసిఆర్ నాయకత్వంలో ప్రజల పక్షాన పోరాడుతూ, కొట్లడుతూ ప్రజలకు సుబిక్షమైన సంక్షేమ పలాలు అందిస్తమే తప్ప ఇటువంటి హత్య రాజకీయాలకు దూరంగా ఉంటామన్నారు. 
ఈ కార్యక్రమంలో పట్టణ అద్యక్షుడు గట్టు సతీష్,ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,కౌన్సిలర్ దేవేందర్ నాయక్,మాజీ ఏఎంసీ చైర్మన్ శీలం ప్రియాంక ప్రవీణ్,అర్బన్ మండల అద్యక్షుడు తుమ్మ గంగాధర్,మాజీ జెడ్పీటీసీ మహేష్,అర్బన్ మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రావు,రూరల్ మండల సమన్వయ కమిటీ సభ్యులు పడిగేల గంగారెడ్డి,ఆనంద్ రావు, ఆసీఫ్,శ్రీనివాస్,గంగారాజం,రాయికల్ మండల సమన్వయ కమిటీ సభ్యుడు కొల్లూరి వేణు,ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ ముత్తు,నాయకులు నక్క గంగాధర్,చింతల గంగాధర్,ప్రణయ్,బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.IMG-20241024-WA0005

Tags:

Related Posts