డీఎస్పీనీ సన్మనిoచిన అంబేద్కర్ సంఘం నాయకులు

డీఎస్పీనీ సన్మనిoచిన అంబేద్కర్ సంఘం నాయకులు

IMG-20241029-WA0001 డిఎస్పి ని సన్మానించిన ఆల్ ఇండియా
అంబేద్కర్ సంఘ నాయకులు

జగిత్యాల  అక్టోబర్ 29 
జగిత్యాల డిఎస్పి కార్యాలయం నందు మంగళవారం ఆల్ ఇండియా
అంబేద్కర్ సంఘ నాయకులు 
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్కృష్ట అవార్డుకు అర్హులైన  డిఎస్పీ రఘు చందన్ నీ కలిసి పుష్ప గుచ్ఛము, శాల్వతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అత్యున్నతమైన అవార్డును జగిత్యాల జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నా డీఎస్పీకి రావడం జగిత్యాల  వాసులందరికీ ఎంతో గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వీరు డిఎస్పి గా జగిత్యాల వచ్చినప్పటినుండి లాండ్ ఆర్డర్ చాలా చక్కగా పనిచేస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ వేణుగోపాల్ , ఆల్ ఇండియా
అంబేద్కర్ సంఘ నాయకులు నల్లా శ్యామ్, నక్క విజయ్ కుమార్, కాళ్ల సత్తయ్య, కాంపల్లి గంగాధర్, దూలూరి వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Related Posts