ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ వాది. జగ్గారెడ్డి
*ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెసు వాదీ*
*జీవన్ నీవు ఒంటరి కాదు, మీ వెంట నేనున్నా...*
*జీవన్ రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి ప్రకటన*
*జీవన్ రెడ్డి ని కలిసిన మధుయాష్కీ గౌడ్*
సిద్ధిపేట, జగిత్యాల ;
కాంగ్రెసు సీనియర్ నేత, మాజీమంత్రి, పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి నిజమైన కాంగ్రెసు వాదీ అని కాంగ్రెసు సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
40 ఏళ్లుగా కాంగ్రెసు పార్టీలో కొనసాగుతున్నారని కష్ట కాలంలో కాంగ్రెసు పార్టీకి, కార్యకర్తలకు జీవన్ రెడ్డి అండగా నిలిచారని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డికి మద్దతుగా జగ్గారెడ్డి శుక్రవారం ప్రకటన చేశారు. కాంగ్రెసు పార్టీలో
ఎం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు
జీవన్ రెడ్డి ఆవేదన చూసి బాధనిపించిందని, జగిత్యాలలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని విచారం వ్యక్తం చేశారు.
జీవన్‌రెడ్డికి అవసరమైనప్పుడు అండగా నేను ఉంటానని స్పష్టంచేశారు.
జీవన్‌రెడ్డి కాంగ్రెస్ వాదని చెబుతూ ఆయన జీవితమంతా కష్టాలేనని పేర్కొన్నారు.
జీవన్‌రెడ్డి ఎప్పుడూ జనాల్లో ఉంటారు, ఈ వయసులో జీవన్‌రెడ్డి ఆవేదన చూసి మనసు కలుక్కుమందని జగ్గారెడ్డి బాధపడ్డారు.
జీవన్‌రెడ్డి ఒంటరి అనుకోవద్దు... మీ వెంట నేనుంటానని ఆయన భరోసా ఇచ్చారు. జీవన్ రెడ్డి సమస్యకు పరిష్కారం చూపించాలని అధిస్థానానికి సూచించారు.
నిత్యం జనం మధ్య ఉండే జీవన్ రెడ్డిని జగిత్యాలలో , సంగారెడ్డిలో నన్ను ప్రజలు ఎందుకు ఓడగొట్టారో అర్థం కావడం లేదని జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.పార్టీని కానీ, కాంగ్రెసు నాయకత్వాన్ని తప్పుపట్టడం లేదని వ్యాఖ్యానించారు.
*ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసిన మధుయాష్కీ*
నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధు యాష్కీ గౌడ్ శుక్రవారం. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ని కలిసి మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి హత్య గురించి అడిగి తెలుసుకున్నారు. జీవన్ రెడ్డి అభ్యంతరాలను కాంగ్రెసు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.