డిసిసి మైనార్టీ చేర్మెన్ నయమ్ కు ఘనంగా సన్మానం
By: Mohammad Imran
On
డీసీసీ మైనారిటీ చైర్మన్ నయీమ్ కు ఘనంగా సన్మానం..
కోరుట్ల, అక్టోబర్ 14
జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఏ. నయీమ్ ను ఏఆర్ వెజిటబుల్స్ యాజమాన్యం మొహమ్మద్ అర్షద్ మరియు మొహమ్మద్ అష్షు లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నయీమ్ భాయ్కు శాలువాలు కప్పి, శుభాకాంక్షలు తెలియజేశారు. మైనారిటీల అభ్యున్నతికి, యువత సంక్షేమానికి, సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి నయీమ్ మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి, ప్రజాసేవలో ముందుండే ఆయనకు జిల్లా స్థాయిలో కీలక బాధ్యతలు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఇట్టి సన్మాన కార్యక్రమంలో పలువురు మైనారిటీ యువకులు పాల్గొన్నారు.
Tags:

