రిపోర్టర్ లపై ధర్డ్ డిగ్రీ ప్రయోగం.... ఎస్ ఐ, ఎస్పీ కార్యాలయనికి అటాచ్చడ్

 రిపోర్టర్లపై ఎస్ఐ థర్డ్ డిగ్రీ ప్రయోగం... ఎస్పీ కార్యాలయానికి అటాచ్
రాజన్న సిరిసిల్ల జిల్లా:
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో పోలీసుల అధికార దుర్వినియోగం, లంచాల వసూళ్లపై వార్తలు రాసినందుకు 'ఏక్ ధమ్' న్యూస్ రిపోర్టర్లు శేఖర్, సంపత్‌లపై గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ అత్యంత అమానుషంగా 'థర్డ్ డిగ్రీ' ప్రయోగించారు. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల అవినీతి, అధికార దుర్వినియోగం మరియు లంచాల బాగోతంపై 'ఏక్ ధమ్' న్యూస్ రిపోర్టర్లు శేఖర్, సంపత్ ధైర్యంగా సత్యశోధన కథనాలు ప్రచురించారు. దీనిపై కక్షగట్టిన గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్ తన అధికార బలంతో వారిని టార్గెట్ చేసి దారుణంగా చితకబాదారు.
జర్నలిస్టులపై జరిగిన ఈ పాశవిక దాడి, పోలీసుల అరాచకంపై ప్రజా సంఘాలు మరియు జర్నలిస్టు వర్గాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే అత్యంత సీరియస్‌గా తీసుకుని వెంటనే స్పందించారు. తక్షణమే చర్యలకు ఉపక్రమిస్తూ, బాధ్యుడైన గంభీరావుపేట ఎస్ఐ శ్రీకాంత్‌ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుని, పత్రికా స్వేచ్ఛపై దాడి చేసే ఎవరినైనా ఉపేక్షించేది లేదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తగు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి.

Tags: