దళిత జర్నలిస్ట్లపై ధర్డ్ డిగ్రీ ప్రజస్వమ్యం పై దాడి కల్వకుంట్ల కవిత

దళిత జర్నలిస్ట్లపై ధర్డ్ డిగ్రీ ప్రజస్వమ్యం పై దాడి కల్వకుంట్ల కవిత

IMG-20261015-WA0101


*దళిత జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రజాస్వామ్యంపై దాడి*

*ఘటనకు బాధ్యులైన పోలీసులపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి*

*తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత*


హైదరాబాద్ :
దళిత జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ప్రజాస్వామ్యంపై దాడి అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో దళిత జర్నలిస్టులు పొత్తూరి శేఖర్, సంపత్ లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన గంభీరావు పేట్ ఎస్సై శ్రీకాంత్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం "ఎక్స్" లో పోస్ట్ చేశారు. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీకి పాల్పడిన ఎస్సై సహా మిగతా పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలన్నారు. ఎస్సై భూ అక్రమాలు, పంచాయతీలు, సెటిల్ మెంట్లపై వార్తలు రాస్తే అక్రమ కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా అని ప్రశ్నించారు. గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌లోనే జర్నలిస్టుల నోట్లో గుడ్డలు కుక్కి, అత్యంత పాశవికంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని తీవ్రంగా హింసించారన్నారు. ఇది అత్యంత అమానుష చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మేజిస్ట్రేట్ రిమాండ్ తిరస్కరించారంటే ఏ స్థాయిలో వారిపై పోలీసులు దాడి చేశారో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై ఈ తరహా దాడులు ఆక్షేపణీయమన్నారు. జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని..ఈ ఘటనకు బాధ్యుడైన గంభీరావుపేట ఎస్సై పై నామమాత్రపు చర్యలతో సరిపెట్టాలని చూస్తే అది పోలీసు వ్యవస్థకు మచ్చ తెస్తుందన్నారు. ఈ విషయంపై డీజీపీ వెంటనే స్పందించి ఎస్సైతో పాటు బాధ్యులపై వారందరిపై అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags:

Related Posts