బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్టు పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు, పరారీలో మరో ముగ్గురు వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్

బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్టు  పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు, పరారీలో మరో ముగ్గురు   వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్

బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్టు

పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు, పరారీలో మరో ముగ్గురు 

వివరాలు వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ రఘుచందర్

చురకలు ప్రతినిధి, జగిత్యాల,  జనవరి 31 : బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్న ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని జగిత్యాల డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని పరిశ్రమలశాఖ మేనేజర్ గా విధులు నిర్వర్తిస్తున్న అధికారిని కొందరు వ్యక్తులు లోని నిమిత్తం వెళ్లి సదరు అధికారికి తెలియకుండా రూ.5వేలు ఇస్తూ విడియో తీశారు. సదరు
విడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తామని ఆ అధికారిని బెదిరింపులకు పాల్పడుతూ అతని వద్ద నుండి పలు దఫాలుగా రూ.8లక్షల 50వేలను వసూలు చేశారు. నిందితులు సదరు అధికారిని ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఆ అధికారి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితులైన ఏ। భూక్య సంతోష్ నాయక్, ఏ2 పాలకుర్తి రాకేష్ లను అదుపులోకి తీసుకోని వారి వద్ద నుండి రెండు తులాల బంగారు గొలుసు, రూ.8వేల నగదు, ఒక కారు, ఒ సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు
తెలిపారు. ఏ3 మాలోత్ తిరుపతి, ఏ4 భూక్య గంగాధర్, ఏ5 లాలే జగన్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులకు పట్టుబడిన ఏ1 భూక్య సంతోష్ నాయక్, ఏ2 పాలకుర్తి రాకేష్ ను రిమాండ్ కు తరలించామని వివరించారు. ఈ సమావేశంలో టౌన్ సీఐ వేణుగోపాల్, ఎస్ఐ కిరణ్ కుమార్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.IMG-20250131-WA0109

Tags: