వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కు చర్యలు తీసుకోవాలి డిసిసి మైనార్టీ చెర్మన్ నయీమ్
జిల్లాలో వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.
వక్ఫ్ బోర్డు చైర్మన్ ను కోరిన జిల్లా డిసిసి మైనార్టీ చైర్మన్ నయీం.
చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 16: జగిత్యాల జిల్లాలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ ఎం.ఏ. నయీమ్, తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీని కోరారు. శుక్రవారం హైదరాబాద్ లోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో చైర్మన్ ను కలిసిన నయీమ్, జిల్లాలో వక్ఫ్ భూముల స్థితిగతులను వివరించారు. ఆస్తులు అక్రమ ఆక్రమణలకు గురికాకుండా పర్యవేక్షణ పెంచాలని, ఆక్రమణలకు గురైన వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నూతనంగా జిల్లా డిసిసి మైనార్టీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నయీమ్ ను వక్ఫ్ బోర్డు చైర్మన్ శాలువాతో సన్మానించి అభినందించారు. జిల్లాలో మైనారిటీలను సంఘటితం చేస్తూ కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చైర్మన్ హామీ ఇచ్చినట్లు నయీమ్ తెలిపారు.

