ముస్లింల విద్య ప్రమానాలను మెరుగు పరిచెందుకు యం. ఐ యం. కృషి. ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

ముస్లింల విద్య ప్రమానాలను మెరుగు పరిచెందుకు యం. ఐ యం. కృషి. ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

ముస్లింల విద్యా ప్రమాణాలను మెరుగు పరిచేందుకు ఎంఐఎం కృషి

సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ గైడ్స్ పంపిణీలో నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్

జగిత్యాల, నవంబర్ 05:-

తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఎంఐఎం పార్టీ విశేషంగా కృషి చేస్తుందని నాంపల్లి ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం జగిత్యాల పట్టణంలో రూబీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటుచేసిన సాలారే మిల్లత్ ఆల్ ఇన్ వన్ 2026 గైడ్స్ ను జగిత్యాల పట్టణ ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలల్లో పదవ
తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్
మాట్లాడుతూ.. విద్యార్థులందరూ ముఖ్యంగా బాల, బాలికలు కష్టపడి చదివి తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, జీవితంలో పదవ తరగతి
వార్షిక పరీక్ష కీలకమని, ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వడానికి సాలారే మిల్లత్ గైడ్ దోహదపడుతుందని అన్నారు. మాజీ ఎంపీ దివంగత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ భవిష్యత్ తరాలకు ఉన్నత విద్యను అందించాలనే సంకల్పంతో గత 25 సంవత్సరాల క్రితం ఆల్ ఇన్ వన్ గైడ్లను ఎంఐఎం పార్టీ తరఫున ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అందజేస్తున్నట్లు, సాలారే మిల్లత్ తర్వాత, తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీలు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఉర్దూను బ్రతికించడం కోసం ఉర్దూ మీడియం పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం, ముస్లింల విద్య అభివృద్ధి కోసం అమోఘమైనటువంటి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఒవైసీ, శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీల సారథ్యంలో.. హైదరాబాద్ నగరవ్యాప్తంగా పేద ముస్లింల పిల్లలకు బాసటగా నిలవాలని సంకల్పంతో కార్పొరేట్ స్థాయిలో 20 పాఠశాలలను స్థాపించి, 20 వేల మంది విద్యార్థులకు ప్రతి ఏటా విద్యను ఉచితంగా అందిస్తున్నటువంటి ఘనత వీరికి దక్కుతుందన్నారు. ముస్లిం యువత చెడు వ్యసనాలను మాని ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి రాజకీయాల్లో రాణించాలని తమ అధినేత బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. సాలరే మిల్లత్ గైడ్స్ ను దివంగత సుల్తాన్ సలావుద్దీన్ నాడు భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా ఈవిద్యా ప్రణాళికను తయారు చేశారని ఆయన గొప్ప సంకల్పంతో నేడు ముస్లింలు క్రీడల్లో, ఉన్నత విద్యలో, సివిల్స్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్1 వంటి ఉద్యోగాల్లో, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా , ఇటు రాజకీయాల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఈకార్యక్రమంలో ఎంఐఎం కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్,  జగిత్యాల జిల్లా అధ్యక్షుడు ఖాజా లియాఖాత్ అలీ మొహసీన్,  జమాతే ఇస్లామీ జిల్లా అధ్యక్షుడు షోయబ్ ఉల్ హఖ్, ,పార్టీ పట్టణ అధ్యక్షుడు సుమేర్ అలీ, కౌన్సిలర్ రజియుద్దీన్, కౌన్సిలర్ ఆయుబ్ ఖాన్, నాయకులు, నౌమాన్, వహీద్,  జిల్లా ఉపాధ్యక్షుడు బాసిత్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.IMG-20261105-WA0058

Tags:

Related Posts