డి ఐ జి కార్యాలయం లో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్

డి ఐ జి కార్యాలయం లో ఇద్దరు ఉద్యోగుల సస్పెండ్

*డీఐజీ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్*

*బదిలీలు, పదోన్నతులు, పనిష్మెంట్ల వ్యవహారాల్లో అవినీతి ఆరోపణలు*

వరంగల్డీ,FB_IMG_1792226464296ఐజీ కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. సూపరింటెండెంట్ యుగంధర్, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.

బదిలీలు, పదోన్నతులు, పనిష్మెంట్లకు సంబంధించిన వ్యవహారాల్లో అవినీతికి పాల్పడుతున్నారంటూ బాధితులు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై స్పందించిన డీజీపీ విచారణకు ఆదేశించారు.

డీజీపీ ఆదేశాల మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్, భద్రాద్రి జోన్ డీఐజీ శ్వేత ప్రాథమిక విచారణ చేపట్టారు. విచారణలో వెల్లడైన వివరాల ఆధారంగా గురువారం రాత్రి ఇద్దరు ఉద్యోగులపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

ఈ ఘటన పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆరోపణలపై తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Tags: