బలహీన వర్గాల రిజర్వేషన్లను తొలగించి.. అస్మదీయులను అందలమెక్కించడమే బిజెపి సిద్ధాంతం ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్
బలహీన వర్గాల రిజర్వేషన్లను తొలగించి.. అస్మదీయులను అందలమెక్కించడమే బిజెపి సిద్ధాంతం
ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్
కరీంనగర్, ఫిబ్రవరి 9:-
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, ఎన్నికల ముంగిట ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య వైశ్యామ్యాలు రగిల్చే కుట్రలో భాగంగా రాజ్యాంగాన్ని మారుస్తామనడం, దేశంలో వెనుకబడిన వర్గాల రిజర్వేషన్లను తొలగిస్తామనడం, దేశంలో మైనార్టీలను తరిమికొడతామని చెప్పడం వంటి వ్యాఖ్యలు చూస్తుంటే, ప్రజాస్వామ్య బద్ధమైన దేశాన్ని, ప్రపంచం దృష్టిలో దీక్ష ఔన్నత్యాన్ని బిజెపి పార్టీ ఏ విధంగా దిగజార్చి కుట్రలు చేస్తుందో యావత్తు ప్రజలు అర్థం చేసుకోవాలని ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హిందూ ముస్లింలను రెచ్చగొట్టి బిజెపి ఎన్నికల ముంగిట రాజకీయ లబ్ధి కోసం కుటిల రాజకీయాలకు పాల్పడుతొందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో పేద, వెనకబడిన, దారిద్ర రేఖకు దిగుమనున్న ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని, రాజేందర్ సచార్ కమిటీ తోపాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం వేసిన శ్రీకృష్ణ కమిటీలు ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో దళితుల కంటే దుర్భరమైన స్థితిలో ముస్లింలు జీవితం వెల్లదిస్తున్నారని విద్యకు దూరమై ఉద్యోగ ఉపాధి రంగాల్లో తీవ్రంగా వెనుకబాటుతనానికి గురయ్యారని రాజేందర్ సచార్ కమిటీ, శ్రీకృష్ణ కమిటీలు ఆనాటి ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించిన మాట బిజెపి నాయకులకు తెలియకపోవడం వారి బుద్ధిహీనత్వానికి నిదర్శనం అన్నారు . కేవలం రాజకీయ పబ్బం కోసం మాత్రమే బీసీ రిజర్వేషన్ల నుండి ముస్లిం అనే పదాన్ని తొలగిస్తామనడం కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు తగదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న ముస్లిం రిజర్వేషన్లను ప్రాణాలు అడ్డుపెట్టి అయినా కాపాడుకుంటామని చెప్పారు. తెలంగాణ ముస్లిం సమాజానికి ఎంఐఎం పార్టీ అండగా ఉండగా బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీల మద్దతు ఉండగా రిజర్వేషన్ల తొలగింపు ఎవరి తరం కాదని ముస్లింలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో వెనకబడిన ముస్లింలకు మాత్రమే రిజర్వేషన్లు కల్పిస్తున్నారని సయ్యద్, మొగల్, పఠాన్, షాఫాయి తెగలలోని ముస్లింలు సైతం అత్యంత దుర్భరమైన స్థితిలో జీవితం గడుపుతున్నారని వారికి సైతం బీసీ లో రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. రాజకీయ పదం కోసం హిందూ ముస్లింల మధ్య చిచ్చులు పెట్టడం మానేసి బిజెపి నాయకులు అభివృద్ధి మీద దృష్టి పెట్టాలని ఇకనైనా చౌకబారు విమర్శలు కేంద్ర మంత్రులు మానేసి తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని సూచించారు. కేంద్ర మంత్రులుగా ప్రజలు ఇచ్చిన బాధ్యతలను మరచి అభివృద్ధి చేయాల్సిన వీళ్ళు, కులాల మధ్య, మతాల ప్రాతిపదికన ప్రజల మధ్య చిచ్చు పెట్టడం ఎంతవరకు సమంజసం అని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులని అందుకే బిజెపిని తెలంగాణలో అధికారంలోకి రాకుండా గట్టిగా గుణపాఠం చెప్పిన బిజెపి నేతలకు ఇంకా సోయి, సిగ్గు రావడంలేదని విమర్శించారు. భారతదేశంలో ముస్లింలేకుంటే బిజెపి పార్టీ ఉనికే ఉండదని, ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా ఉండేదన్నారు.