మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

మద్యం మత్తులో డ్రెయినేజీలో పడి వ్యక్తి మృతి

IMG-20241105-WA0000
మద్యం మత్తులో డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి...

జగిత్యాల పట్టణ కేంద్రంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో మదీనా హోటల్లో పనిచేస్తున్న సాగర్ అనే వ్యక్తి నిన్న రాత్రి మధ్య మత్తులో హోటల్ ముందున్న డ్రైనేజీలో పడి మృతి చెందాడు.. గత కొంతకాలంగా పట్టణ కేంద్రంలోని మదీనా హోటల్లో పనిచేస్తున్న సాగర్ మద్యానికి బానిసై ఫుల్లుగా తాగి మద్యం మత్తులో నడవలేని పరిస్థితిలో అటు ఇటు తూగుతూ నడుస్తూ వెళ్లి పక్కనే ఉన్న డ్రైనేజీలో పడడం ద్వారా ఎవరు గమనించలేదు. ఉదయానే హోటల్ యజమాని వచ్చి చూడగా సాగర్ డ్రైనేజీలో పడి ఉండడంతో అంబులెన్స్ కు ఫోన్ చేసి  చూడగా సాగర్ మరణించినట్లు తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు..

Tags:

Related Posts