దుబ్బ రాజన్నను దర్శించుకున్న బోగ శ్రావణి
By: Mohammad Imran
On
రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న డా. శ్రావణి.
చురకలు విలేకరి,
సారంగాపూర్, అక్టోబర్ 28 :
జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్ల కోనాపూర్ దుబ్బ రాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. శ్రావణి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్బంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఇటీవలే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎంపీ ఫండ్ ద్వారా మంజూరైన నిధులతో చేపడుతున్న పనుల గురించి ఆలయ ఈఓ, చైర్మన్ తో కలిసి సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో వడ్లురి అనూష, ఆలయ చైర్మన్ శంకరయ్య, నాయకులు వీరబత్తిని అనిల్ కుమార్, ఆముద రాజు, గంగరాజాం, ప్రణయ్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Tags: