పెద్ద చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
By: Mohammad Imran
On
పెద్ద చెరువులో దూకి మహిళ ఆత్మహత్య
ఇబ్రహింపట్నం , అక్టోబర్,27
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ లింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డల జ్యోతి (55) అను ఆమె జీవితంపై విరక్తి పొందండి చెరువుల దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్ ఐ అనిల్ తెలిపారు ఆదివారం ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి మృతురాలు గత పది సంవత్సరాలుగా షుగర్ , హైబీపీతో పాటు మోకాలు నొప్పులతో బాధపడుతున్నది ఎన్ని హాస్పిటల్ లో తిరిగిన తన యొక్క అనారోగ్యం బాగుపడకపోవడంతో జీవితం పై విరక్తి చెంది శనివారం రాత్రి సమయంలో ఇంటి నుండి బయటకు వెళ్లి బండ లింగాపూర్ గ్రామ పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోగ మృతురాలు కుమారుడు గడ్డల విక్రం పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.
Tags: