ఘనంగా యమద్వితీయ వేడుకలు

ఘనంగా యమద్వితీయ వేడుకలు

ఘనంగా యమద్వితీయ వేడుకలు
..........................................
 రామ కిష్టయ్య సంగన భట్ల...
    .................................

 ప్రాచీన సాంప్రదాయాలకు నెలవైన ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో యమ ద్వితీయ పర్వదిన వేడుకలను ఆదివారం ఘనంగా  నిర్వహించారు. యమ ద్వితీయ సందర్భంగా మహా అభిషేక ఆయుష్యుసూక్తం, యమ సూక్తమంత్రం,. పురుషు సూక్తం ప్రత్యేక పూజాదికాలను, అనంతరం జ్వరహార స్తోత్రము, ఆయుష్య హోమం, రోగ నివారణ సూర్యములచే పంచామృత అభిషేక యమాష్టక పఠనం, హారతి, మంత్రపుష్ప, తీర్ధ ప్రసాద వితరణాది ప్రత్యేక కార్యక్రమాలను దేవస్థానం పక్షాన నిర్వహించారు. దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో, ఆస్థాన వేదపండితులు బొజ్జా రమేశ్ శర్మ,  సూపరింటెండెంట్ కిరణ్  సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్,అర్చకులు నేరెళ్ల సంతోష్ కుమార్, వొద్దిపర్తి కళ్యాణ్ కుమార్,బొజ్జ సంతోష్ కుమార్ ,బొజ్జ సంపత్ కుమార్ , బొజ్జ రాజగోపాల్,ప్రదీప్ కుమార్ , ఆకాల మృత్యు  రాహిత్యానికి, దీర్ఘ ఆయువుకై ప్రత్యేకంగా గోత్రనామాదులతో ఆయుష్యసూక్త యుక్త పూజలను నిర్వహించగా, పవిత్ర గోదావరి నదిలో ఉదయాత్పూర్వం నుండి మంగళ స్నానాలు ఆచరించిన భక్తులు విశేష పూజాధి కాలలో పాల్గొని తరించారు. అపమృత్యు, పీడా నివారణకై యమ గండా దీపానికి దీనికి నూనె పోసుకున్నారు. 

సంప్రదాయాచరణ

కార్తీక శుక్ల విదియను "కాంతి ద్వితీయ, పుష్ప ద్వితీయ, యమ ద్వితీయ, అని పిలుస్తారు.  క్షేత్రంలోని స్థానికులు వంశ పారంపర్య సాంప్రదాయాచరణలో భాగంగా ఏడాదికో మారు అరుచెందే భగినీ హస్త భోజనానికి విశేష ప్రాధాన్యతచ్చే క్రమంలో ఈ సందర్భంగా సోదరులు, తోబుట్టువుల ఇళ్ళకు ఆహ్వానింపబడి, కానుకలను స్వీకరించి పండగ జరుపుకున్నారు.

 కార్తీక దామోదరునికి పూజలు

 కార్తీక మాసోత్సవ వేడుకల సందర్భంగా కార్తీక శుక్లపక్ష ద్వితీయ నాడు క్షేత్రం భక్తజన సంద్రమైంది. ఉదయాత్పూర్వం ఆలయ అర్చకులు మంగళ వాద్యాలతో దేవ స్థానం నుండి గోదావరికి వెళ్ళి, పవిత్ర నదీ జలాలను తెచ్చి, స్థానిక ఇల వేల్పులను అభిషేకించారు. ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల, యమ ధర్మరాజ, ప్రసన్నాం జనేయ, శ్రీరామలింగేశ్వరాలయాలలో ఉదయం ప్రత్యేక అర్చనలు, పూజలు, అభిషేకాలు కంకుమార్చనలు, నిత్య కళ్యాణా కార్యక్రమాలను నిర్వహించగా, సాంప్రదాయాచరణాసక్తులైన భక్తులు ప్రత్యేక పూజాదికాలలో పాల్గొన్నారు. శ్రీవేణుగోపాల, శ్రీవేంకటేశ్వర అలయాల మధ్యగల ఉసిరిక వృక్షం వద్ద కార్తీక దామోదరునికి ఈసందర్భంగా ప్రత్యేక పూజలోన రించారు. భక్తిపారవశ్యులైన ముత్తయిదువలు ఉసిరిక చెట్టుచుట్టూ సనాత ఆచార ప్రకారం ప్రదక్షిణలు గావించారు. విష్ణు అర్పణగా వత్తుల దీపాలను వెలిగించారు. పవిత్ర గోదావరి నదీ జలాలలో దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెట్టారు. శ్రీరామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక చండీ ప్రదక్షిణలను ఆదరించారు. 

ఉప్పొంగిన భక్తిపారవశ్యం

హరిహర స్వరూపమూ, హరిహరాదులకు ప్రియమైన కార్తీక మాస సందర్భంగా, ప్రత్యేకించి శివకేశవుల సన్నిధి, భక్తుల పాలిటి పెన్నిధిగా పేరెన్నికగన్న హరి హర క్షేత్రమైన ధర్మపురి పట్టణంలో ఆది వారం భక్తి పారవశ్యం పొంగి పొర్లింది. క్షేత్రంలో నిర్వహిస్తున్న కార్తీక మాసోత్సవాలలో అంతర్భాగంగా, యమ ద్వితీయగా వినుతి కెక్కిన కార్తీక శుద్ధ ద్వితీయ పర్వదినమైనందున రాష్ట్రం నలుమూలల నుండే గాక, రాష్టేతర సుదూర ప్రాంతాల నుండి ఏతెంచిన భక్తులు గోదావరి స్నానాదులు ఆచరించారు. ఉదయాత్పూర్వం నుండే పిల్లా పాపలను చంకల్లో ఎత్తుకుని, భక్తిపరవశులై పరి సరాలను మైమరచి, తరతరాల వారసత్వ ఆచార నేపథ్యంలో క్షేత్రానికి అరుదెంచి, పవిత్ర గోదావరినదిలో మంగళ స్నానాలను ఆచరించి, ప్రత్యేక పూజాదులలో పాల్గొని, అనంతరం దైవ దర్శనాలకై బారులు తీరి వివిధ ఆలయాల ముందు వేచి యున్నారు. దేవస్థానంలో ప్రత్యేక పూజాదులలో పాల్గొని మొక్కులు చెల్లించు కున్నారు.  వివిధ ఆలయాల అర్చకుల ఆధ్వర్యంలో, దేవస్థానం సిబ్బంది పర్యవేక్షణలో ప్రత్యేక అర్చనలు గావించగా, భక్తులు తన్మయత్వంతో భాగస్వాములై, కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో తనివితీరా వీక్షించి తరించారు. అనూహ్య రీతిలో  క్షేత్రానికి ఏతెంచిన భక్తులకు దేవస్థానం పక్షాన ఏర్పాట్లు చేశారు.IMG-20241103-WA0009

Tags:

Related Posts