ఎంఐఎం పార్టీ జపం చేయకుంటే బిజెపికి, బండి సంజయ్ కు మనుగడలేదు

ఎంఐఎం పార్టీ జపం చేయకుంటే బిజెపికి, బండి సంజయ్ కు మనుగడలేదు

ఎంఐఎం పార్టీ జపం చేయకుంటే బిజెపికి, బండి సంజయ్ కు మనుగడలేదు

సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఉమ్మడి జిల్లాలో ఎంఐఎం పోటీ

ఎంఐఎం పార్టీ జపం చేయకుంటే బిజెపికి, బండి సంజయ్ కు మనుగడలేదు

 

ఎంఐఎం కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్

కరీంనగర్, నవంబర్ 3

స్థానిక సంస్థల ఎన్నికలైనా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా, తమ అధినేత అసదుద్దీన్ ఒవైసీ సూచనలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎంఐఎం పార్టీ పోటీ చేయబోతుందని కరీంనగర్ ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ వెల్లడించారు. ఆదివారం కరీంనగర్ లోని గులాం అహ్మద్ నివాసంలో ఏర్పాటుచేసిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎంఐఎం పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తలు, ప్రజాప్రతినిధుల సమావేశం ఎంఐఎం పార్టీ అధినేత హైదరాబాద్ ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు, గులాం అహ్మద్ హుస్సేన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను కలుపుకొని సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. ఉమ్మడి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం కోసం ఆశావహులు ఆయా ప్రాంతాల్లో ఎంఐఎం పార్టీ బాధ్యులను సంప్రదించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు అనేది ఎంఐఎం హై కమాండ్ నిర్ణయిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లాలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 75 కార్పొరేటర్, కౌన్సిలర్ సీట్లలో పోటీ చేస్తుందని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో 25 సీట్లలో పోటీ చేసి కనీసం 20 సీట్లు గెలుచుకునేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను సైతం చేజిక్కించుకుని మున్సిపల్ కార్పొరేషన్ పై ఎంఐఎం జెండా ఎగురవేస్తామన్నారు. రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేల సహకారంతో ఎంఐఎం డివిజన్లను అభివృద్ధి చేస్తామన్నారు. గడచిన 5సంవత్సరాలలో ఎంఐఎం పార్టీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన నిర్ణయాత్మక శక్తిగా ఎదిగిందన్నారు.  ఎంఐఎం పార్టీ పనితనమే ఇందుకు ఉదాహరణ అని వివరించారు. ఎన్నికల కోసం ఎంఐఎం ఎదురు చూడదని, ప్రతిరోజు ఎన్నికల మాదిరిగానే సేవలందిస్తుందన్నారు.
ఇక కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ పై గులాం అహ్మద్ విమర్శనాస్త్రాలను సంధించారు. ఎంఐఎం పార్టీ జపం చేయకుంటే బిజెపికి, బండి సంజయ్ కి రాజకీయ మనుగడ లేదన్నారు. పాత బస్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు కాబట్టే, గడచిన నాలుగు దశాబ్దాలుగా నిర్విరామంగా ఎంఐఎం పార్టీ విజయం సాధిస్తూ వస్తుందన్న మాట బండి సంజయ్ గుర్తుతెరగాలని చెప్పారు. దివంగత ఎంఐఎం పార్టీ మాజీ అధ్యక్షుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ ఆలోచన విధానంతో, ప్రస్తుతం తమ అధినేత, ఎంపీ బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ కృషితో, శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ పట్టుదలతో, పాతబస్తీలో ఎంఐఎం విద్యాభివృద్ధికి చేసినటువంటి ప్రగతితో హైదరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో లక్షలాదిమంది విద్యార్థులు, ఎంఐఎం విద్యాసంస్థల్లో చదివి డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా, ఐటీ సెక్టార్లలో హెచ్ఆర్లుగా రాణిస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించారని గుర్తు చేశారు. దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా తో పాటు కరీంనగర్లో బండి సంజయ్, ఏఒక్కటైన అక్బరుద్దీన్ ఒవైసీ మాదిరిగా సొంత డబ్బులతో ఉచిత విద్యాసంస్థలను నెలకొల్పి వేలాదిమంది విద్యార్థులకు ఉచితంగా పేదలకు విద్యను ఎందుకు అందించడం లేదో, గణనీయమైన అభివృద్ధిని ఎందుకు చేయడం లేదో, తెలంగాణ ప్రజలు , కరీంనగర్ ప్రజలు తెలంగాణ బిజెపి నాయకులను ప్రశ్నించాలని కోరారు. బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి, ఇతరుల గురించి మాట్లాడితే మంచిదని సలహా ఇచ్చారు. గడచిన ఐదు సంవత్సరాలలో ఎంపీగా ఉండి, కేంద్రంలో అధికారంలో ఉండి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కరీంనగర్ కు ఒక్క రూపాయి తెచ్చిన దాఖలాలు లేవనీ, ఎంఐఎం పై, ఓవైసీ సోదరులపై విమర్శలు చేయడం సర్వ సాధారణమని అభివర్ణించారు. ఇప్పుడు ఎన్నికలు లేవనీ, ఇకనైనా ఎంఐఎం పై విమర్శలు మాని, మత రాజకీయాలకు స్వస్తి పలికి, కరీంనగర్ అభివృద్ధిపై దృష్టి సాధించాలని బండి సంజయ్ కి సూచించారు. బండి సంజయ్ ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. ఆయన చేతకానితనంతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం గడచిన ఆరేండ్లలో 50 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. ఇకనైనా కరీంనగర్ ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు, అందుబాటులో ఉండి, ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ, అభివృద్ధిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, యూనుస్ నదీమ్ జగిత్యాల, అబ్దుల్ రఫీ కోరుట్ల, అక్రమ్ మెట్ పల్లి, ఇమ్రాన్ అలీ పెద్దపల్లి, మీర్ జాకీర్ అలీ రామగుండం, ముస్తఫా సిరిసిల్ల అధ్యక్షులతోపాటు, ఎంఐఎం నాయకులు బర్కత్ అలి, హఫీజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రి యూసుఫ్, ఖమరుద్దీన్, ఆతిన, ఇబ్రహీం, కార్పొరేటర్లు అఖిల్ ఫిరోజ్, శర్ఫుద్దీన్, నాయకులు అలీబాబా, అజర్ దబీర్ తో పాటు ఎంఐఎం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కరీంనగర్ ఎంఐఎం డివిజన్ల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.IMG-20241103-WA0016

Tags:

Related Posts