న్యాయం కోసం వెళితే నాపైనే కౌంటర్ కేసు చేశారు

న్యాయం కోసం వెళితే నాపైనే కౌంటర్ కేసు చేశారు

న్యాయం కోసం వెళ్తే వాపై పోలీస్ స్టేషన్ కౌంటర్ ఫైల్ చేశారు..

చురకలు ప్రతినిధి, జగిత్యాల, అక్టోబర్ 24 : జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్పన్నపేట గ్రామంలో బండారి వెంకటరాజం తన 8 గుంటల భూమిని చదును చేస్తున్న క్రమంలో ముగ్గురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారని, అందులో కౌన్సిలర్ కూసరి అనిల్ ఉన్నాడని వెంకటరాజం అనే వ్యక్తి తెలిపాడు. దీంతో వెంకటరాజం జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా పోలీసులు తనపైనే కౌంటర్ ఫైల్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని, తన వద్ద ఉన్న
డాక్యుమెంట్లు చూసి తనకు న్యాయం చేయాలని వెంకటరాజం కోరుతున్నాడు.

రాజకీయాల్లో ఉంటే మా భూమిని కాపాడుకోవద్దా..?

కౌన్సిలర్ కూసరి అనిల్.....

జగిత్యాల అర్బన్ మండలంలోని తిప్పన్నపేట గ్రామ శివారులో తమ ముగ్గురు తాతలకు కలిపి 27 గుంటల భూమి ఉండేదని, అందులో ఇద్దరు వారసులు 18 గుంటల భూమిని
విక్రయించుకున్నారని, తమకు చెందిన 9 గుంటలను భూమిని వెంకటరాజం అనే వ్యక్తి చదును చేయడానికి ప్రయత్నించడానికి ఆ సమయంలో తాము అక్కడికి వెళ్లి అడ్డుకోగా, వెంకటరాజం అనే వ్యక్తి తనపై దాడి చేశాడని తెలిపారు. తాను రాజకీయాల్లో ఉన్నంతా మాత్రనా తన భూమిని వదులుకోవాలా.? కౌన్సిలర్ కూసరి అనిల్ ప్రశ్నించాడు. తనను వెంకటరాజం అనే వ్యక్తి రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.IMG-20241024-WA0006

Tags:

Related Posts